సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 12:21:48

అల్లు అర్జున్ ఫ‌స్ట్‌..బెల్లంకొండ నెక్ట్స్

అల్లు అర్జున్ ఫ‌స్ట్‌..బెల్లంకొండ నెక్ట్స్

ద‌క్షిణాది సినిమాల‌కు ఉత్త‌రాదిన మంచి డిమాండ్ ఉంటుంద‌నే విషయం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సౌతిండియాలో తెర‌కెక్కి.. స‌రిగ్గా ఆడ‌ని సినిమాలకు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగానే ఉంటుంది. సౌతిండియా సినిమాల రైట్స్ ద‌క్కించుకున్న హిందీ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల విష‌యంలో ఎలాంటి కొద‌వ లేదు. ఎందుకంటే హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ రైట్స్ ద‌క్కించుకున్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మంచి లాభాలే వ‌స్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన జ‌య జాన‌కి నాయ‌క హిందీలో ఖూంఖ‌ర్ పేరుతో డ‌బ్ అయింది. యూట్యూబ్ హిందీ వెర్ష‌న్ కు 300 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ త‌ర్వాత అత్య‌ధిక వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచిన రెండో భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఈ రెండు చిత్రాలు బోయ‌పాటి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన‌వే కావ‌డం విశేషం. మ‌రోవైపు బెల్లంకొండ న‌టించిన క‌వ‌చం యూట్యూబ్ లో 200 మిలియ‌న్ల వ్యూస్‌, అల్లుడు శీను 100 మిలియ‌న్ వ్యూస్ సాధించాయి. యూట్యూబ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిగిలిన చిత్రాలు యూట్యూబ్ లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo