బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 11:21:04

త‌న పిల్ల‌ల క్యూట్ ఫోటో షేర్ చేసిన స్నేహా రెడ్డి

త‌న పిల్ల‌ల క్యూట్ ఫోటో షేర్ చేసిన స్నేహా రెడ్డి

ఇండ‌స్ట్రీలో స్టార్స్‌కే కాదు వారి పిల్ల‌లకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ పిల్ల‌ల‌తో పాటు అల్లు అర్జున్ పిల్ల‌లని నెటిజ‌న్స్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. వారి ఫోటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోతుంటారు. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి త‌న పిల్ల‌ల క్యూట్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.

అయాన్, అర్హ‌లు రెయిన్ కోట్ ధ‌రించి వ‌ర్షంలో నిలుచొని ఉండ‌గా, ఆ స‌న్నివేశాన్ని కెమెరాలో బంధించారు. అంద‌మైన గార్డెన్‌లో క‌ల‌ర్ రెయిన్ కోట్స్ ధ‌రించి ఉన్న ఇద్ద‌రు చిన్నారులు చిరున‌వ్వు చిందిస్తూ క‌నిపిస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం క‌రోనా ఎఫెక్ట్ తగ్గిన త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo