శనివారం 30 మే 2020
Cinema - Apr 27, 2020 , 13:21:51

అల్లు అరవింద్‌ పెద్ద‌కోడ‌లు.. కొత్త చాలెంజ్‌!

అల్లు అరవింద్‌ పెద్ద‌కోడ‌లు.. కొత్త చాలెంజ్‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. దీంతో  ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన‌ ఉద్యోగులు వ‌ర్క‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్నారు. ఈ అవ‌కాశం లేని వారు చేసేదేం లేక ఖాళీగా ఉంటున్నారు. ముఖ్యంగా సెల‌బ్రీటీల‌కు ఇది మంచి స‌మ‌యం. షూటింగుల పేరుతో ఇంటి ప‌ట్టున అస‌లే ఉండ‌రు. కుటుంబానికి దూరంగా ఉంటూ బిజీగా గ‌డుపుతారు. వారంతా ఇప్పుడు కుటుంబంతో క‌లిసి ఆనందంగా గ‌డిపే స‌మ‌యం. వంట‌లు, వ్యాయామాలు, కొత్త కొత్త చాలెంజ్‌లు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవ‌ల పిల్లో చాలెంజ్‌, బీ ది రియ‌ల్ మేన్ అంటూ కొత్త చాలెంజ్‌లు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. ఈ త‌ర‌హాలోనే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు వెంక‌టేశ్ భార్య నీలు షా స‌రికొత్త‌గా ఫ‌న్నీ చాలెంజ్ విసిరింది.

 శీర్షాసనం వేసిన ఆమె .. ఒక కాలితో మరో కాలికి ఉన్న సాక్స్‌ను తొలిగించింది. ఇలా శీర్షాసనంలో ఉండగానే రెండు పాదాలకు ఉన్న సాక్సులను తొలగించడం విశేషం. ఇది ఎలా చేయాలో వీడియో ద్వారా చూపించింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్వారెంటైన్‌లో ఈ ఫ‌న్నీ చాలెంజ్ అంద‌రూ స్వీక‌రించండంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. అలానే ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లోనే ఉండండంటూ పిలుపునిచ్చింది.


logo