శనివారం 04 జూలై 2020
Cinema - May 30, 2020 , 15:03:56

అల్లు ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్స్‌

అల్లు ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్స్‌

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్ ఈ రోజు 33వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌ర్త్‌డేని అల్లు ఫ్యామిలీ సెల‌బ్రేట్ చేసింది. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇంట్లోనే కేక్ త‌యారు చేయ‌గా, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేశాడు శిరీష్‌. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న ఫ్యామిలీ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని శిరీష్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేకాక త‌న‌కి విషెస్ తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

అల్లు శిరీష్ బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్‌లో అల్లు అరవింద్ ఆయ‌న స‌తీమ‌ణితో పాటు బ‌న్నీ, స్నేహా రెడ్డి, వెంక‌టేష్ పాల్గొన్నారు. 2017లో ఒక్క క్ష‌ణం చిత్రంతో మంచి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న శిరీష్ చివ‌రిగా ఏబీసీడీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 


logo