ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 00:32:33

ఐటీ స్కామ్‌ నేపథ్యంలో..

ఐటీ స్కామ్‌ నేపథ్యంలో..

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం కథానాయకుడు అల్లు అర్జున్‌ ఆవిష్కరించారు.‘ఇండియాలో మొదలైన అమెరికాను వణికించిన 450 మిలియన్‌ డాలర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్పడిన వారిని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించడంతో ఈ టీజర్‌ మొదలవుతుంది. ఈ టీజర్‌ చూసిన వారికి అసలు మోసగాళ్లు చేసిన స్కామ్‌ ఏమిటి? ఆ స్కామ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది అంటోంది చిత్రబృందం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. logo