ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 12:51:28

మృతుల‌ కుటుంబాల‌కు ప‌వ‌న్ 27వ చిత్ర బృందం, బ‌న్నీ సాయం

మృతుల‌ కుటుంబాల‌కు ప‌వ‌న్ 27వ చిత్ర బృందం, బ‌న్నీ సాయం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌ర‌పాల‌ని భావించిన అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే క్ర‌మంలో క‌రెంట్ షాక్‌తో మృతి చెందారు. చిత్తూరులోని శాంతిపురంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదంలో  10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌నపై మెగా హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ , వ‌రుణ్ తేజ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్క‌రికి రూ. 2ల‌క్ష‌ల చొప్పున ఆర్ధిక సాయం ప్ర‌క‌టించారు ప‌వ‌న్. ఇక వ‌కీల్ సాబ్ నిర్మాత‌లు, ప‌వ‌న్ 27వ సినిమా నిర్మాత‌లు   ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ చొప్పున ఆర్థిక స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అల్లు అర్జున్ కూడా ఈ ప్ర‌మాధంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ..మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు ప్రకటించారు. మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలియ‌జేసిన బ‌న్నీ, వారి కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. త‌మపై చూపిస్తున్న ప్రేమ‌కి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 


logo