బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 09:37:25

బ‌న్నీపై ప్రేమ‌తో బ‌ట్ట‌లు పంపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

బ‌న్నీపై ప్రేమ‌తో బ‌ట్ట‌లు పంపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ నటుడిగానే కాకుండా బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా  రౌడీ బ్రాండ్ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని త‌యారు చేపిస్తుంటారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండంతో సెల‌బ్స్ కూడా వీటిపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. గ‌తంలో విజ‌య్ తాను డిజైన్ చేసిన బ‌ట్ట‌ల‌కు అల్లు అర్జున్ కు బ‌హుమ‌తిగా పంపగా, వాటిని అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకు సంబంధించి వేడుక‌లో ధ‌రించాడు. 

ఇక తాజాగా మ‌రోసారి బ‌ట్ట‌లు పంపారు విజ‌య్. ఈ సంద‌ర్భంగా దేవ‌రకొండ‌తో పాటు రౌడీ క్ల‌బ్‌కు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. నువ్వు పంపిన బ‌ట్ట‌లు చాలా కంఫోర్ట్‌గా ఉన్నాయి. నువ్వు చూపించే ఈ ప్రేమ‌కు నా ధ‌న్య‌వాదాలు అన్నీ బ‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. అంతేకాకుండా ఆ బ‌ట్ట‌లు ధ‌రించి దిగిన ఫొటోల‌ని కూడా షేర్ చేశాడు. సినిమాల విష‌యానికి వ‌స్తే విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ సినిమా చేస్తుంటే, అల్లు అర్జున్ పుష్ప మూవీతో బిజీగా ఉన్నాడు.


logo