సోమవారం 25 మే 2020
Cinema - Apr 07, 2020 , 23:08:17

అల్లు అర్జున్‌ ‘పుష్ప’?

అల్లు అర్జున్‌ ‘పుష్ప’?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. బుధవారం అల్లు అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించబోతున్నామని నిర్మాణ సంస్థ మైత్రీమేమకర్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం  ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఇందులో అల్లు అర్జున్‌ పాత్ర పేరు పుష్పక్‌ నారాయణ్‌ అని...దానిని స్ఫురించేలా సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో చిత్తూరు నేపథ్యంలో నడిచే ఇతివృత్తమిదని, అల్లు అర్జున్‌ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు.


logo