శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 02:12:37

అల్లు అర్జున్‌ ప్రశంసించారు

  అల్లు అర్జున్‌ ప్రశంసించారు

‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన నా తొలి సినిమా ఇది. ఈ విజయం సరికొత్త అనుభూతిని పంచుతోంది’ అని తెలిపింది సీరత్‌కపూర్‌. ఆమె కథానాయికగా నటించిన ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ ఇటీవల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవికాంత్‌ పేరేపు దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.  ఈ సినిమా గురించి సీరత్‌కపూర్‌ మాట్లాడుతూ ‘తెలుగులో తొలి డిజిటల్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. రుక్సార్‌ పాత్ర కోసం రానా నన్ను సంప్రదించారు. ఆధునిక ఛాయలతో పాజిటివ్‌ కోణంలో నా పాత్రను మలిచిన విధానం నచ్చి ఈ సినిమా అంగీకరించాను.  ప్రేమ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నేటి యువత పడుతున్న సంఘర్షణను ఈ సినిమాలో కొత్త కోణంలో ఆవిష్కరించారు.  పూర్తిస్వేచ్ఛనిస్తూ దర్శకుడు నా నుంచి చక్కటి నటనను రాబట్టుకున్నారు. ఈ సినిమా  ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నా. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతో చిత్రబృందం ఉంది. అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుందనుకుంటున్నా. అల్లు అర్జున్‌ సినిమా చూసి ప్రశంసించారు. నా నటన బాగుందని చెప్పడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. హరీష్‌శంకర్‌, రాహుల్వ్రీంద్రన్‌తో పాటు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు సినిమా బాగుందన్నారు’ అని చెప్పింది.


logo