శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 07, 2020 , 17:27:26

అల్లు అర్జున్ ‘పుష్ప’ను లీక్ చేసిందెవరు?

అల్లు అర్జున్ ‘పుష్ప’ను లీక్ చేసిందెవరు?

ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం సంచలన దర్శకుడు సుకుమార్‌తో ఆయన చేస్తున్న చిత్రానికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఏప్రిల్ 8 ఉదయం 9 గంటలకు అప్‌డేట్ ఉంటుందని సోమవారం మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే మేకర్స్ ఇవ్వబోతున్న అప్‌డేట్ ముందుగానే లీక్ అవ్వడంతో అల్లు అర్జున్‌తో పాటు చిత్రయూనిట్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన అసలు సర్‌ప్రైజ్ ఏమిటంటే.. చిత్ర టైటిల్‌ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బన్నీ బర్త్‌డేకి ఒకరోజు ముందే ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా లీక్ చేశారు. 

అయితే ఈ లీక్‌పై చిత్రయూనిట్ చాలా సీరియస్‌గా ఉంది. అసలు ఈ చిత్రానికి మొదటి నుంచి ‘శేషాచలం’ అనే పేరు వినబడింది. కానీ ఈ చిత్రంలో బన్నీ పాత్ర పేరు ‘పుష్పక్ నారాయణ’. దీనిలో నుంచే ‘పుష్ప’ అనే టైటిల్‌ను సుకుమార్, అల్లు అర్జున్ ఫైనల్ చేశారు. ఇది తెలిపి ఫ్యాన్స్‌ని సంతోషపరచాలని ప్లాన్ చేస్తే ముందుగానే దీనిని లీక్ చేసి ఏఏ20 టీమ్‌ షాక్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడే ఇలా లీక్‌ల పర్వం ఉంటే.. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే.. దీనిని కంట్రోల్ చేయడం కష్టమని భావించిన చిత్రయూనిట్.. ఈ లీక్‌కు కారణమైన వారిపై కఠినంగా వ్యవహరించాలని చూస్తుంది. ముందుగా అసలు ఎవరు ఈ లీక్‌కు కారకులో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.


logo