శుక్రవారం 03 జూలై 2020
Cinema - Apr 22, 2020 , 10:15:41

బ‌న్నీని ప్రేమ‌లోకి దింప‌నున్న‌ త‌లైవా త‌న‌య‌..!

బ‌న్నీని ప్రేమ‌లోకి దింప‌నున్న‌ త‌లైవా త‌న‌య‌..!

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌ని థ్రిల్‌కి గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల చిత్రంలో పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి నటించనున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా  పుష్పలో నివేదా థామస్‌ ఓ కీలక పాత్ర చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్భార్ సినిమాలో ఆయ‌న కూతురిగా న‌టించిన నివేదా థామ‌స్ పుష్ప‌లో బ‌న్నీ ల‌వ‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ట‌. అల్లు అర్జున్ ని ప్రేమ‌లో ప‌డేసే పాత్ర‌లో నివేదా సరిగ్గా సూట‌వుతుంద‌ని భావించి ద‌ర్శ‌కుడు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. ప్రస్తుతం నివేదా పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్’‌లో నటిస్తున్నారు. కాగా సునీల్‌ శెట్టి, నివేదా థామస్‌ ఇటీవల దర్భార్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక క‌థానాయిక‌గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ర‌ష్మిక  అటవీశాఖ అధికారిగా కనిపించనున్నట్టు స‌మాచారం.

 


logo