బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 11:25:33

కూతురితో క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేస్తున్న అల్లు అర్జున్

కూతురితో క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేస్తున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్‌, త‌న కూతురు అర్హ‌కి సంబంధించిన వీడియోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కూతురికి తండ్రి ప్రేమ‌ని పంచుతూ అల్లు అర్జున్ చేసే ముద్దు ముచ్చ‌ట చూసే వారికి అపురూపంగా ఉంటుంది. అర్హ త‌న‌ని బే అన్నా కూడా న‌వ్వుతూ స్వీక‌రించ‌డం, రాములో రాములా సాంగ్‌లో బ‌న్నీ వేసిన స్టెప్స్ దోశె స్టెప్స్ అని అర్హ అన‌డం, ఆ మాట‌ల‌కి బ‌న్నీ ఫిదా అవ్వ‌డం మ‌నం ఇప్ప‌టికే చూశాం. 

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన అల్లు అర్జున్ పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దా స‌మయాన్నిగ‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న కూతురితో క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోని స్నేహా రెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీనికి మార్నింగ్ స్ట్రెచెస్ అనే కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. బ‌న్నీ వ‌ర్కవుట్ చేయ‌డానికి మంచి పార్ట్న‌ర్ దొరికింద‌ని కామెంట్స్ పెడుతున్నారు.  


logo