ప్రస్తుతం మన హీరోలు ఇతర ఇండస్ట్రీల మార్కెట్‌పై దృష్టి పెట్టారు. స్టార్ హీరోలందరు తాము చేసే సినిమాలను పాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. బాహుబలి తరహాలో ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారాలని భావిస్తున్న బన్నీ త్వరలో స్ట్రైట్ హిందీ చిత్రం చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ‘పుష్ప’ తర్వాత కొరటాల శివ తో చేయాల్సిన మూవీ లేట్ అయ్యే అవకాశాలు ఉండటంతో బన్నీ ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నాడట. ప్రస్తుతం కొందరు బాలీవుడ్ స్టార్స్ చెప్పే కథలు కూడా వింటున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.