అద్భుతమైన కెమెరామెన్‌గా, వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా తెలుగు, తమిళంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన కేవీ ఆనంద్(54) ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో ప్రతి ఒక్కరు షాక్‌కు గురయ్యారు. అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా కేవీ ఆనంద్‌కు సంతాపం తెలియజేశారు.
డైరెక్టర్ కేవీ ఆనంద్ ఇక లేరనే విషాద వార్తతో నిద్ర లేచాను. మంచి కెమెరామెన్, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం.మీరు ఎప్పటికీ మా మనసులలోనే ఉంటారు. అయినప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు.