ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసులిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బన్నీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక శిరీష్ మంచి సక్సెస్ సాధించేందుకు కొన్నాళ్లుగా కృషి చేస్తున్నాడు. ఈ రోజు శిరీష్ బర్త్‌డే సందర్భంగా ఆయన 6వ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రేమ కాదంట అనే టైటిల్‌తో సినిమా చేస్తుండగా ఇందులో శిరీష్, అను ఎమ్మాన్యుయేల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
శిరీష్ బర్త్ డే సందర్భంగా ఆయన అన్న అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసారు బన్నీ. ఈ ట్వీట్‌కి స్పందించిన శిరీష్.. థాంక్యూ AA (అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ రిప్లై ఇచ్చాడు.