సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 11:52:10

నిహారిక నిశ్చితార్థంలో స్టైలిష్ లుక్‌లో క‌నిపించిన అల్లు అర్జున్

నిహారిక నిశ్చితార్థంలో స్టైలిష్ లుక్‌లో క‌నిపించిన అల్లు అర్జున్

కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల-చైత‌న్యల‌ నిశ్చితార్థం  గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.  ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు అతి కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. నిశ్చితార్థ సంబ‌రానికి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ స‌తీస‌మేతంగా హాజ‌రు కాగా, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీజ‌,సుస్మిత‌, క‌ళ్యాణ్ దేవ్‌, వ‌రుణ్ తేజ్ త‌దిత‌రులు సందడి చేశారు.

వేడుక‌లో అల్లు అర్జున్ త‌న సతీమ‌ణి స్నేహా రెడ్డితో క‌లిసి స్టైలిష్ లుక్‌లో మెరవ‌డంతో పాటు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో బ‌న్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా,  కరోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ పుష్ప అనే సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇందులో బ‌న్నీ లుక్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది.logo