శుక్రవారం 14 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 23:39:21

‘బుట్టబొమ్మ’ సరికొత్త సంచలనం

‘బుట్టబొమ్మ’ సరికొత్త సంచలనం

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చక్కటి కుటుంబ కథా చిత్రంగా మెప్పించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమన్‌ స్వరసారథ్యం వహించిన ఈ చిత్ర గీతాలు శ్రోతల్ని విశేషంగా అలరించాయి. అర్థవంతమైన సాహిత్యం, వైవిధ్యమైన బాణీల కలబోతగా గీతాలు జనరంజకంగా నిలిచాయి. ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ గీతం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అత్యధికులు వీక్షించిన తెలుగు పాటగా నిలిచింది. ఈ పాటను ఇప్పటివరకు 263 మిలియన్ల్ల మంది వీక్షించడం విశేషం. ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. ఈ పాటలోని నృత్యరీతులు యువతను ఉర్రూతలూగించాయి. 


logo