శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 08, 2020 , 13:30:21

యంగ్ డైరెక్ట‌ర్స్ వేట‌లో ప‌డ్డ స్టార్ ప్రొడ్యూస‌ర్

యంగ్ డైరెక్ట‌ర్స్ వేట‌లో ప‌డ్డ స్టార్ ప్రొడ్యూస‌ర్

టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల‌లో అల్లు అర‌వింద్ ఒక‌రు. ఆయ‌న గీతా ఆర్ట్స్ సంస్థ‌లో అద్భుత‌మైన సినిమాలు చేస్తూ మ‌రోవైపు గీతా ఆర్ట్స్ 2 బేన‌ర్ ద్వారా చిన్న సినిమాలని ప్రొత్స‌హిస్తున్నారు.   తెలుగు రాష్ట్రాల నుండి డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అల్లు అర‌వింద్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ఇటీవ‌ల‌ ఓటిటి ప్లాట్‌ఫామ్ 'ఆహా' ను ప్రారంభించగా , ఇందులోప్రత్యేకమైన తెలుగు కంటెంట్‌ను మాత్ర‌మే ప్రసారం చేయ‌నున్నారు.

 విస్తృతమైన ప్రజాదరణ పొందిన అమెజాన్ మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలతో పోటీ పడటానికి, ఆహా ప్రేక్షకులను ఆకర్షించడానికి   అల్లు అరవింద్ అనేక ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.  తాజా స‌మాచారం ప్రకారం అల్లు అరవింద్ ఆహాని మ‌రింత జ‌నాల‌లోకి ఎలా తీసుకెళ్ళాల‌నే దానిపై ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌లు చేయ‌డ‌మే కాకుండా,   సలహాలను సేకరిస్తున్నారు. ఇదే క్ర‌మంలో నూత‌న ద‌ర్శ‌కుల‌ని కొత్త కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌, వెరైటీ షోస్ చేసేలా ఆలోచ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. 


logo