బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 09, 2020 , 09:33:03

క‌రోనాకి బ‌లైన మ‌రో హాలీవుడ్ న‌టుడు

క‌రోనాకి బ‌లైన మ‌రో హాలీవుడ్ న‌టుడు

మృత్యు మ‌హ‌మ్మారి కరోనా ప్ర‌తి రోజు కొన్ని వేల మంది క‌బ‌ళిస్తుంది. దీనిని నుండి త‌ప్పించేందుకు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ, కొంద‌రు మృత్యువాత ప‌డుతూనే ఉన్నారు. తాజాగా ప్ర‌ముఖ హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఈ విష‌యాన్ని న‌టి రోని బ్లాక్లే సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. గొప్ప నటుడు, నాష్‌విల్లెలో నాకు భర్తగా నటించిన అలెన్ కరోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్న అలెన్ తొలిసారి 1968లో వ‌చ్చిన 69వ చిత్రంతో తెరంగేట్రం చేశారు. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు.   చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు.


logo