మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 19:28:00

పాపుల‌ర్ సింగర్‌ రూ.72 ల‌క్ష‌ల‌తో వ్యూస్ కొన్నాడ‌ట‌..!

పాపుల‌ర్ సింగర్‌ రూ.72 ల‌క్ష‌ల‌తో వ్యూస్ కొన్నాడ‌ట‌..!

బాద్ షా..ఇండియాలో ఉన్న పాపుల‌ర్ ర్యాప‌ర్స్ లో ఒక‌డు. అయితే ఎంత పాపుల‌ర్ సెల‌బ్రిటీ అయినా ప్ర‌తీసారి పాజిటివ్ కామెంట్లు మాత్ర‌మే కాకుండా..అప్పుడపుడు ఆరోప‌ణ‌లు కూడా వస్తుంటాయి.  బాద్ షా పాపులారిటీ కోసం యూట్యూట్ నుంచి వ్యూస్ ను కొనుగోలు చేసిన‌ట్టు బాలీవుడ్ సింగ‌ర్ భూమి త్రివేది పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఎవ‌రో ఇన్ స్టాగ్రామ్ లో త‌న పేరు మీద న‌కిలీ ప్రొఫైల్ ను త‌యారు చేశార‌ని ఫిర్యాదు లో పేర్కొంది. సోష‌ల్ మీడియాలో వ్యూస్ క‌నిపించేలా.. ఓ సోష‌ల్ మీడియా కంపెనీ నుంచి బాద్ షాతోపాటు చాలా మందికి న‌కిలీ లైక్స్, ఫేక్ వ్యూస్ కొనుగోలు చేసిన‌ట్టు ముంబై పోలీసులు గుర్తించారు.  త‌న పాట‌ల‌కు ఒక్క‌రోజులో 72 మిలియ‌న్లు రావ‌డం..వ‌ర‌ల్డ్ రికార్డు అని బాద్ షా పేర్కొన‌గా..దీన్ని గూగుల్ మాత్రం కొట్టేపారేసింది.

బాద్ షా త‌న వ్యూస్ పెంచుకోవ‌డం కోసం స‌ద‌రు సోష‌ల్ మీడియా కంపెనీకి రూ.72 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు ముంబై పోలీసులు పేర్కొంటుండ‌గా..బాద్ షా మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేస్తున్నాడు. పాపులారిటీ పెంచుకోవ‌డానికి వ్యూస్ కొనాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని, ముంబై పోలీసుల ద‌ర్యాప్తున‌కు తాను పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు బాద్ షా. మ‌రి పోలీసుల ఆరోప‌ణలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది మ‌రికొన్ని రోజుల్లో తెలుస్తుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo