ఈవీవీ తనయుడిగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నరేష్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అల్లరి సినిమాతో ఆరంగేట్రం చేసిన నరేష్ అల్లరి నరేష్‌గా మారాడు. ఇక తన కెరీర్లో వైవిధ్యమైన సినిమలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ హీరోగా చేస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్లో మెరుస్తున్నాడు.
‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ ,మహర్షి వంటి సినిమాల్లో అల్లరి నరేష్ చేసిన సపోర్టింగ్ పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా మరో హీరో కోసం అల్లరి నరేష్ సపోర్టింగ్ పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మంచు వారబ్బాయి మంచు మనోజ్ ..‘అహం బ్రహ్మస్మి’ అనే విభిన్నమైన సినిమాతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అని టాక్ బలంగా వినిపిస్తుంది.
క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఈ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు.. అసలు సినిమాకే ఈ పాత్ర కీలకమైనదట. అల్లరి నరేష్ మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలరని మేకర్స్ భావిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తన సొంత బ్యానర్ ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’పై ఈ సినిమాను మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. నరేష్ పాత్రకు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. నరేష్ చివరిగా నాంది చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.