అల్లరి నరేష్ (Allari Naresh)కెరీర్లో 50 సినిమాలకు పైగానే నటించాడు. అయితే అన్నింట్లోనూ ఆయన కెరీర్‌నే మార్చేసిన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సుడిగాడు (Sudigaadu). టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు నరేష్ కెరీర్లో లేని కలెక్షన్స్ తీసుకొచ్చింది. స్పూఫ్ సినిమా చేస్తే ఇంతగా జనం ఎగబడి చూస్తారా అనేలా సుడిగాడు సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. తమిళ పడమ్ సినిమాకు రీమేక్‌గా భీమినేని శ్రీనివాసరావు (Bhimaneni Srinivasa Rao) తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 24, 2012న విడుదలైంది.
అంటే సరిగ్గా 9 ఏళ్ళ కింద అన్నమాట. పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించడమే కాకుండా..అల్లరి నరేష్‌కు సడన్ స్టార్ అనే బిరుదు కూడా తీసుకొచ్చింది. సుడిగాడు ఇచ్చిన విజయంతో నరేష్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ అలాంటి విజయం ఇప్పటి వరకు అందుకోలేదు నరేష్. మొన్నొచ్చిన నాంది మాత్రం మంచి వసూళ్లు సాధించింది. మధ్యలో ఈ 9 ఏళ్లు వరుస పరాజయాలతో సతమతమయ్యాడు నరేష్.
ఏరియాల వారిగా కలెక్షన్లు:
నైజాం: 7.18 కోట్లు
సీడెడ్: 3.08 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.14 కోట్లు
ఈస్ట్: 1.57 కోట్లు
వెస్ట్: 1.22 కోట్లు
గుంటూరు: 1.81 కోట్లు
కృష్ణా: 1.34 కోట్లు
నెల్లూరు: 0.59 కోట్లు
ఏపీ + తెలంగాణ: 18.93 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.01 కోట్లు
వరల్డ్ వైడ్: 19.94 కోట్లు
అప్పటి వరకు నరేష్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజినెస్ చేసింది సుడిగాడు. ఈ సినిమాను 9 ఏళ్ల కిందే రూ.8.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేశారు. ఫుల్ రన్ లో మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా రూ.20 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఫలితంగా బయ్యర్లకు ఏకంగా 12 కోట్ల లాభాలు అందించాడు సుడిగాడు.
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!