ఆదివారం 05 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 00:04:57

బంగారు బుల్లోడి వినోదం

బంగారు బుల్లోడి వినోదం

అల్లరినరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయిక. అల్లరినరేష్‌ జన్మదినం సందర్భంగా మంగళవారం చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది.  నిర్మాత మాట్లాడుతూ ‘బ్యాంక్‌ నగల అదృశ్యం నేపథ్యంలో వినోదం, ప్రేమ, సస్పెన్స్‌, సెంటిమెంట్‌ అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. బ్యాంకు ఉద్యోగిగా అల్లరి నరేష్‌ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది. చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం ఆయన పాత్ర వినోదాన్ని పంచుతుంది.  విభిన్నమైన  ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని తెలిపారు తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్‌, సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల.

అండర్‌ ట్రయల్‌ ఖైదీ వ్యథ

‘ఒక మనిషి పుట్టడానికి  తొమ్మిది నెలల టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందేటి సార్‌' అని అడుగుతున్నాడో యువకుడు. అతడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు అల్లరినరేష్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం హీరో విజయ్‌ దేవరకొండ  విడుదలచేశారు.  చేయని నేరానికి జైలు పాలై తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవడం కోసం పోరాడే యువకుడిగా నరేష్‌ కనిపిస్తున్నాడు. నరేష్‌లో కొత్తకోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని, ఎనభై శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత తెలిపారు.


logo