మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 09:11:53

అభి, అఖిల్‌, మోనాల్ విష‌యంలో త‌ల‌దూర్చిన మాస్ట‌ర్

అభి, అఖిల్‌, మోనాల్ విష‌యంలో త‌ల‌దూర్చిన మాస్ట‌ర్

బిగ్ బాస్ హౌజ్‌లోనే కాకుండా బ‌య‌ట కూడా  అభిజిత్‌, అఖిల్‌, మోనాల్ టాపిక్ ఎప్పుడు హాట్ టాపిక్‌. ముందు అభితో క్లోజ్‌గా ఉన్న మోనాల్ త‌ర్వాత అఖిల్‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం దాంతో అభి మోనాల్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌డం విష‌యాలు పాత సినిమాల‌ని గుర్తు చేస్తున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. అయితే మోనాల్ నామినేష‌న్స్ స‌మ‌యంలో ద‌య‌చేసి నా పేరుతో పాటు అభిజిత్‌,అఖిల్ ల పేర్ల‌ని తీయోద్దని ప‌దే ప‌దే కోరిన అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ వారం మ‌ళ్ళీ అదే టాపిక్ తీసి ర‌చ్చ లేపాడు. 

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అమ్మ రాజ‌శేఖ‌ర్ .. అఖిల్‌ని నామినేట్ చేస్తూ అభిజిత్‌తో గొడ‌వైన త‌ర్వాత మోనాల్ నీకు ద‌గ్గ‌ర కావ‌డం నాకు న‌చ్చ‌లేదు అని అన్నాడు. దీంతో చిచ్చుబుడ్డిలా బ‌ర‌స్ట్ అయిన అఖిల్‌.. మోనాల్‌ని ఏ రోజు అభితో మాట్లాడొద్ద‌ని చెప్ప‌లేదు. ఆమె మాట్లాడ‌క‌పోతే మీకెందుకు అంత స‌మ‌స్య‌గా ఉందో నాకు అర్ధం కావ‌డం లేదు. మోనాల్ కోసం నేను ఇక్క‌డికి రాలేదు. ఆమె కోసం మేం కొట్టుకొని విడిపోలేదు. మీరు త‌ప్పుడు స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు అంటూ మాస్ట‌ర్‌పై ఫైర్ అయ్యాడు అఖిల్. 

కుమార్ సాయి వెళ్ళే ముందు క‌రివేపాకుని చూపిస్తే ఎందుకు అంతలా ఫీల‌య్యావు. నువ్వు బాగా ఆడిన కూడా అక్క‌డ ఉన్నావు అని పంచ్ వేశాడు. అది కరెక్ట్ కాదు. వెళ్లిపోయిన వ్య‌క్తి ప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు అని అఖిల్‌ని ప్ర‌శ్నించాడు మాస్ట‌ర్ . నన్ను ‌కొత్తిమీర, కరివేపాకు అంటే ఇలాగే మాట్లాడతా.. ఎలిమినేట్ అయితే ఏదైనా మాట్లాడొచ్చా ? మాకు ఫీలింగ్స్ ఉండ‌వా? మాకు అమ్మానాన్న లేరా? అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. ఇద్ద‌రి మ‌ధ్య చాలా సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఇక మెహ‌బూబ్ త‌న‌ను నామినేట్ చేసిన కార‌ణంగా ప్ర‌శ్న‌ల‌తో ఆయ‌న‌ని ఇబ్బందుల్లో పెట్టింది అరియానా. మ‌న మ‌ధ్య అండ‌ర్‌స్టాండింగ్ లేద‌నే కార‌ణంగా నామినేట్ చేశావు. రేపు వాళ్లు న‌న్ను ఎలిమినేట్ చేస్తే ఎక్క‌డ నుండి వ‌స్తుంది. ఇది డ‌బుల్ గేమ్ అని నాకు అర్ద‌మైంది. నాకు ఇదే న‌చ్చ‌దంటూ త‌ను కూడా మెహ‌బూబ్‌ని నామినేట్ చేసింది.   తాను ముందుకు వెళ్లాలంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను పంపించేయాల‌ని చెప్తూ నోయ‌ల్.. మెహ‌బూబ్‌, అఖిల్‌ను నామినేష‌న్‌లోకి పంపించాడు.  

అభిజిత్‌-మోనాల్‌ల మధ్య మ‌ళ్ళీ ఇష్యూ మొద‌లైంది.ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని అస్స‌లు అస్స‌లు అనుకోలేదు.  న‌న్ను మానిప్యులేట‌ర్ అని ఎందుకు పిలిచావ‌నేది త‌ర్వాత తెలిసింది. ఇది చాలా పెద్ద నేరం అంటూ అభిజిత్‌.. మోనాల్‌పై మండిప‌డ్డాడు. ఇక మోనాల్ త‌న‌కు పన్నీరు క‌ర్రీ లాస్య వండని కార‌ణంగా చాలా ఫీలైన‌ట్టు చెప్పింది. దీనికి లాస్య నేను అప్పుడు బిజీగా ఉండ‌డం వ‌ల‌న వండ‌లేక‌పోయాను. వేరే వారిని అడ‌గొచ్చు కదా అని చెప్పింది. అయితే త‌న పేరుని ప‌దే ప‌దే అఖిల్‌, అభిజిత్‌ల‌తో క‌లిసి వాడ‌టంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన మోనాల్ మ‌ళ్ళీ క‌న్నీళ్ళు పెట్టుకుంది.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ కూడా చాలా హాట్ హాట్‌గా జ‌ర‌గ‌గా ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో  అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, మెహ‌బూబ్‌, లాస్య‌, అఖిల్‌, మోనాల్ ఉన్నారు. వీరిలో ఎవ‌రు నామినేట్ అవుతారు, ఎవ‌రు కొన‌సాగుతారు అనేది తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే.