మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:17:41

యే దివిలో విరిసిన పారిజాత‌మో..

యే దివిలో విరిసిన పారిజాత‌మో..

హైద‌రాబాద్‌:  ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో.. నా మదిలో నీవై నిండిపోయెనే.. ఎస్పీ బాలు మ్యాజిక్ స్వ‌రానికి ఈ పాట ఓ మ‌చ్చుతున‌క‌. సినీ ప్రేక్ష‌కుల‌కు త‌న స్వ‌రంతో కిక్ ఎక్కించిన అద్భుత గాయ‌కుడు బాలు అని చెప్ప‌డానికి ఈ పాట ఓ తార్కాణం.  1973లో రిలీజైన క‌న్నె వ‌య‌సు చిత్రంలోని ఈ పాట యావ‌త్ తెలుగు లోకాన్ని ఉర్రూత‌లూగించింది.  అద్భుత‌మైన క‌వి భావాన్ని.. అమ‌ర‌మైన త‌న స్వ‌రంతో.. ఎస్పీ బాలు ఈ పాట‌కు ఓ కొత్త ఊపునిచ్చారు. పాట‌లో క‌వి హృద‌యాన్ని బాలు త‌న గాత్రంతో ప‌లికించిన తీరు అసామాన్య‌మైది. యువ మ‌న‌సులో ఉండే ఆక‌ర్ష‌ణ‌ను అద్భ‌తమైన స్వ‌రరూపంలో బాలు సినీ ప్రేక్షకుల్ని ఆసాంతం థ్రిల్ చేశారు.  

అల‌నాటి పాట‌ల్లో ఇదొక్క‌టే కాదు.  బాలు ఎన్నో పాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.  మ్యూజిక్ మాస్ట‌ర్ ఎవ‌రైనా.. త‌న స్ట‌యిల్‌లో పాట‌లు పాడుతూ .. ప్రేక్ష‌కుల్ని ఎప్ప‌టిక‌ప్పుడూ మెప్పింప చేశారు.  తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందూ భాష‌ల్లోనూ సినీ గీతాల‌ను ఆల‌పించారు.  సాంగ్ ఏదైనా త‌న శైలిలో ఆక‌ట్టుకోవ‌డం ఎస్పీ బాలు ప్ర‌త్యేక‌త‌.  సంగీత ద‌ర్శ‌కుడు ఇచ్చిన సందేశాల‌ను,  క‌వి అందించిన భావాల‌ను.. ప్రేక్ష‌కుల‌కు చేరుకునేలా పాట‌లు పాడ‌డం బాలు గొప్ప‌త‌నం. పాట‌లోని గాంభీర్యాన్ని త‌న గాత్రంతో ప్రేక్ష‌కులు ప‌ర‌వ‌శింప‌చేసేలా పాడేవారు.  

సిరిమ‌ల్లె నీవే సిరిజ‌ల్లు నాదే..  మ‌ల్లెతీగ వాడి పోయిన మ‌ర‌ల పూలు పూయునా.. కురిసింది వాన నా గుండెలోనా.. ఈ రేయి తీయ‌నిది ఈ చిరుగాలి మ‌న‌సైన‌ది.. ఓ బంగ‌రు రంగుల చిల‌కా ప‌లుక‌వా.. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్ర‌మ‌వాసివి.. క‌నుల‌ముందు నీవుంటే క‌విత పొంగి పార‌దా.. మ‌ల్లెలు పూచె స‌ల్ల‌ని వేళ ఈ రేయి హాయిగా.. ర‌వి వ‌ర్మ‌కే అంద‌ని ఒకే ఒక అందానివో.. మ‌బ్బే మ‌స‌కేసిందిలే పొగ మంచె.. లాంటి అసంఖ్యాక‌మైన ఆల్‌టైమ్ హిట్ పాట‌ల‌తో ఎస్పీ బాలు త‌న స్వ‌ర‌జీవితాన్ని ప్రేక్ష‌కుల‌కు స‌మ‌ర్పించారు. 

 


logo