శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 17:11:14

ఆల్ ది 'బెస్ట్' ఫ్రెండ్స్ ..త‌మ‌న్నా-శృతిహాస‌న్‌

ఆల్ ది 'బెస్ట్' ఫ్రెండ్స్ ..త‌మ‌న్నా-శృతిహాస‌న్‌

సినీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడున్న హీరోయిన్ల‌లో అతికొద్ది మంది మాత్రమే మంచి రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ జాబితాలో ప్ర‌ముఖంగా వినిపించే పేర్లు త‌మ‌న్నా, శృతిహాస‌న్. ఈ ఇద్ద‌రూ స్టార్ హీరోయిన్లు ఆప్ స్క్రీన్‌లో మంచి స్నేహితులు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించ‌డం ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న కామ‌న్ థింగ్‌. అంతేకాదు ఒక‌ప్పుడు అభిమానుల్లో ఉత్సాహం నింపిన ఈ తార‌ల్లో జోష్ కొంత త‌గ్గింద‌నే చెప్పాలి. 30ల‌లోకి అడుగ‌పెడుతున్న ఈ అందాల భామ‌లు ఇపుడు రూటు మార్చి డిజిట‌ల్ వ‌రల్డ్ తో తాము కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా కైవ‌సం చేసుకోవాల‌ని పోటీ ప‌డుతున్నార‌ని ఇపుడు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం శృతిహాస‌న్, రానాతో క‌లిసి నెట్ ఫ్లిక్స్  ప్రాజెక్టు చేస్తుంది. మ‌రోవైపు త‌మ‌న్నా కూడా ఓటీటీ ప్రాజెక్టులు చేస్తోంది. అమెజాన్ తో త‌మిళంలో ఓ సినిమా చేస్తుండ‌గా..తెలుగులో ఆహా ప్లాట్ ఫాం కోసం మ‌రో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సిల్వ‌ర్ స్ర్కీన్ పై మెరిసిన ఈ భామ‌లిద్ద‌రూ డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లో కూడా త‌మ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆడియెన్స్ కు వినోదాన్ని అందించేందుకు పోటీ ప‌డుతున్న బెస్ట్ ఫ్రెండ్స్ శృతి-త‌మ‌న్నాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు, ఫాలోవ‌ర్లు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.