శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 01, 2020 , 02:00:18

కలలన్నీ నిజయమ్యాయి

కలలన్నీ నిజయమ్యాయి

సుహాస్‌, చాందినిచౌదరి జంటగా నటించిన చిత్రం ‘కలర్‌ ఫోటో’. సందీప్‌రాజ్‌ దర్శకుడు. సాయిరాజేష్‌, బెన్నీ నిర్మాతలు. ఇటీవలే ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులముందుకొచ్చింది. శుక్రవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన వారందరూ ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. తొలివారంలోనే మా సినిమాను ఏడులక్షల మంది వీక్షించారు. దర్శకుడు సందీప్‌రాజ్‌ గొప్ప సినిమా అందించాడు. ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్‌ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నారు’ అన్నారు. ‘ఈ సినిమాతో సుహాస్‌ను హీరో చేశాను. ఆర్టిస్టులందరూ అద్భుతమైన నటను ప్రదర్శించారు. నా ఫేవరేట్‌ కమెడియన్‌ సునీల్‌తో పనిచేయడం ఆనందంగా అనిపించింది’ అని దర్శకుడు తెలిపారు. సునీల్‌ మాట్లాడుతూ “కొట్టకుండా, తిట్టకుండా ఈ సినిమాలో విలన్‌గా భలే భయపెట్టావ్‌ భయ్యా’ అంటూ చాలా మంది ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు. అక్కడే నా పాత్ర సక్సెస్‌ అయిందని అర్థమైంది. ఇండస్ట్రీకి విలన్‌ అవుదామని వచ్చి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నా. ఈ సినిమాతో విలన్‌గా చేయాలన్న కల తీరిపోయింది’ అని చెప్పారు. ఈ సినిమా గురించి ఎన్నో కలలు కన్నామని, అవన్నీ నిజమయ్యాయని హీరో సుహాస్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

తాజావార్తలు