ఆదివారం 31 మే 2020
Cinema - May 20, 2020 , 17:02:15

ఆ పాత్రతో కెరీర్‌ ముగిసిపోతుందన్నారు..

ఆ పాత్రతో కెరీర్‌ ముగిసిపోతుందన్నారు..

ముంబై: క్యా కెహ్‌నా చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ ప్రీతిజింటా. 2000 మే 19న విడుదలైన ఈ చిత్రం  విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. సైఫ్‌ అలీఖాన్‌, ప్రీతి జింటా లీడ్‌ రోల్స్‌లో వచ్చిన ఈ మూవీకి కుందన్‌ షా దర్శకత్వం వహించారు. తన తొలి చిత్రం విడుదలై 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది ప్రీతిజింటా. ఈ సినిమాలో ప్రీతిజింటా..ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో టీనేజ్‌ లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన యువతి పాత్రలో నటించింది. 

అయితే ప్రీతి ఈ సినిమాలో పాత్రను ఓకే చేసే ముందు అందరూ నీకైమైనా పిచ్చా.. ఈ సినిమాతో మీ కెరీర్‌ ముగిసిపోవడం ఖాయమని అన్నారట. కానీ ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటుంటే నా కెరీర్‌లో అద్భుతమైన సినిమాగా నిలిచింది. నాకు ఇలాంటి మంచి సినిమాలో అవకాశమిచ్చినందుకు నిర్మాత రమేశ్‌ తౌరానీకి, హనీ ఆంటీకి ధన్యవాదాలు తెలుపుతూ..ప్రీతిజింటా సినిమాకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo