గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 16:42:27

అంద‌రూ షూటింగ్ షురూ చేశారు..ఒక్క‌రు త‌ప్ప‌..!

అంద‌రూ షూటింగ్ షురూ చేశారు..ఒక్క‌రు త‌ప్ప‌..!

అక్కినేని కుటుంబంలో దాదాపు అంద‌రూ హీరోలు  షూటింగ్స్ రీస్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్టిన టాలీవుడ్ హీరోల్లో నాగార్జున మొద‌టి వ్య‌క్తి. నాగ్ ఒకేసారి బిగ్ బాస్ సీజ‌న్ 4, వైల్డ్ డాగ్ షూటింగ్స్ షురూ చేశాడు. మ‌రోవైపు నాగ‌చైతన్య శేఖ‌ర్ క‌మ్ముల‌తో తీస్తున్న‌ ల‌వ్ స్టోరీ సినిమా షురూ చేయ‌గా..అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని మొద‌లుపెట్టాడు. సుశాంత్ కూడా ఇచట వాహ‌న‌ములు నిలుపరాదు  చిత్రాన్ని ఇటీవ‌లే ప్రారంభించాడు. సుమంత్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.

వీరంతా త‌మ ప‌నుల్లో తిరిగి చేరిపోగా ఒక్క యాక్ట‌ర్ మాత్రం ఇంకా షూటింగ్స్ మొద‌లు పెట్ట‌లేదు. ఆ వ్య‌క్తి ఎవ‌రో మీకు ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌. వ‌ర్కింగ్ ఫ్ర‌మ్ హోంను స‌మంత కొన‌సాగిస్తోంది. రాంచ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌ లాంఛ్ చేసిన యూట్యూబ్ ఛాన‌ల్ కుక‌రీ షో (వంట‌ల ప్రోగ్రాం)లో ర‌క‌ర‌కాల వంట‌ల‌తో స‌మంత అంద‌రినీ ప‌లుక‌రిస్తుంది. రెండు చిత్రాల‌కు సంత‌కం చేసిన స‌మంత ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా షూట్‌ను మొద‌లు పెట్ట‌లేదు. మ‌రి ఈ స్టార్ హీరోయిన్ సినిమా కోసం ఎప్పుడు మేక‌ప్ వేసుకొని కెమెరా ముందుకొస్తుందో చూడాలి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo