మంగళవారం 26 మే 2020
Cinema - May 22, 2020 , 15:25:12

వేరే వ్య‌క్తితో రిలేష‌న్‌.. స్పందించిన న‌వాజుద్ధీన్ భార్య‌

వేరే వ్య‌క్తితో రిలేష‌న్‌.. స్పందించిన న‌వాజుద్ధీన్ భార్య‌

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ భార్య ఆలియా కొద్ది రోజులుగా వార్త‌లలో నిలుస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. 2009లో న‌వాజుద్దీన్‌ని వివాహ‌మాడిన ఈమె త‌న భ‌ర్త, వారి  కుటుంబ స‌భ్యుల టార్చ‌ర్ భ‌రించ‌లేక విడాకుల‌కి అప్లై చేసింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈమెయిల్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపింది.

అయితే వ‌యాకామ్‌ ఎగ్జిక్యూటివ్‌ పీయూష్‌ పాండేతో అలియా ప్రేమలో ఉన్నట్లు ప్ర‌చారం జోరందుకుంది. ఈ నేప‌థ్యంలో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన అలియా.. త‌న‌పై వ‌చ్చిన పుకార్ల‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. త‌ప్పుడు వార్త‌ల‌ని ఖండించుక‌నేందుకు నేను ట్విట్ట‌ర్‌లోకి వ‌చ్చాను. నాకు ఎవ‌రితో సంబంధం లేదు. కొంద‌రితో నా ఫోటోని జ‌త చేసి ప్ర‌స్తుత ప‌రిణామాల‌ని పక్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సత్యాన్ని కొనడం లేదా మార్చడం సాధ్యం కాదు.వేరే వ్య‌క్తుల‌ని కాపాడేందుకు వ్య‌క్తిత్వాన్నిత‌ప్పుప‌ట్ట‌డం చాలా త‌ప్పు. నా కోసం, నా పిల్ల‌ల కోసం ధృఢంగా ఉండేందుకు సంసిద్ధంగా ఉన్నాను అని ఆలియా పేర్కొంది 


logo