ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 21:53:09

సడక్‌-2 పోస్టర్‌ విడుదల.. మహేశ్‌భట్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌..

సడక్‌-2 పోస్టర్‌ విడుదల.. మహేశ్‌భట్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌..

ముంబై: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు మహేశ్‌భట్‌ కూడా ఓ కారణమంటూ నెటిజన్లు మరోసారి విరుచుకుపడ్డారు. తన కూతుళ్లు అలియాభట్, పూజాభట్ నటించిన ‘సడక్- 2’ మొదటి పోస్టర్‌ లుక్‌ను దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్‌భట్‌ సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘మీరు ముగింపుకు వచ్చేసరికి.. అక్కడ ముగింపు లేదని మీరు కనుగొంటారు’ అని ఇంగ్లిష్‌లో క్యాప్షన్‌ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు భారీగా ట్రోల్‌ చేశారు. 

చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల మాదిరిగా మహేశ్‌భట్‌ నెపాటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని పలువురు కామెంట్ చేశారు. సుశాంత్‌ డిప్రెషన్‌లోకి వెళ్లేందుకు మహేశ్‌భట్‌ కూడా ఒక కారణమని, అందుకే అతడి సడక్‌-2 చిత్రాన్ని బహిష్కరిస్తామని ఒకరు హెచ్చరించారు. ‘ఒకరి జీవితానికి ముగింపు పలికి.. మీ ముగింపును ఎలా విడుదల చేస్తున్నారు’ అని పోస్టర్‌ క్యాప్షన్‌ను ఉద్దేశిస్తూ మరొకరు ట్వీట్‌ చేశారు. తన మనువరాలికంటే తక్కువ వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్న.. ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన వ్యక్తి జైల్లో ఉండాలిగానీ.. బయట ఎలా ఉన్నాడో అర్థంకావట్లేదని ఇంకొకరు కామెంట్‌ చేశారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ నటించిన ‘దిల్‌ బెచారా’ సినిమా చూస్తారా.. లేక సడక్- 2 చూస్తారా అని ప్రజలను కోరుతూ ఒకరు పోల్‌కూడా ప్రారంభించారు.    logo