గురువారం 26 నవంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 10:08:14

ఆర్ఆర్ఆర్ కోసం గొంతు స‌వ‌రించుకుంటున్న అలియా..!

ఆర్ఆర్ఆర్ కోసం గొంతు స‌వ‌రించుకుంటున్న అలియా..!

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత మ‌హేష్ భ‌ట్ ముద్దుల కూతురు అలియా భ‌ట్ ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా ఉంది. ఈ అమ్మ‌డు న‌టిగానే కాదు అడ‌పాద‌డ‌పా సింగ‌ర్‌గాను అల‌రిస్తూ ఉంటుంది. హిందీ చిత్రాలు ‘హైవే’, ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’లో పాటలు  పాడిన అలియా భ‌ట్ ఇప్పుడు రాజ‌మౌళి చిత్రీక‌రిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సింగ‌ర్‌గాను మార‌నుంద‌ని టాక్.

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో అలియా భ‌ట్, ఒలీవియా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో అలియా చిత్ర బృందంతో క‌ల‌వ‌నుంది. రామ్ చ‌ర‌ణ్‌, అలియాపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌, అలియాపై చిత్రీక‌రించే ఓ సాంగ్‌కు అలియాతోనే పాట పాడించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. హిందీలో మాత్ర‌మే అలియా ఆ సాంగ్ పాడ‌నుండ‌గా, మిగ‌తా భాష‌లలో వేరే సింగ‌ర్స్‌తో పాడించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.