శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 30, 2020 , 13:38:48

రిషీ మ‌ర‌ణ‌వార్త‌తో హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకున్న అలియా

రిషీ మ‌ర‌ణ‌వార్త‌తో హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకున్న అలియా

బాలీవుడ్ న‌టుడు రిషీ కపూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ కొన్నాళ్లుగా అందాల భామ అలియా భ‌ట్‌తో డేటింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో వీరి వివాహం ఉంటుంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అలియా- ర‌ణ్‌భీర్ రిలేష‌న్‌పై రిషీ చాలా సార్లు పాజిటివ్‌గానే స్పందించారు. చివ‌రికి త‌న త‌న‌యుడి వివాహం చూడ‌కుండానే రిషీ క‌పూర్  అనంత లోకాల‌కి వెళ్ల‌డం ప్ర‌తి ఒక్క‌రికి కంట త‌డి పెట్టిస్తుంది.  అయితే ఈ రోజు రిషీ క‌పూర్ మ‌ర‌ణ వార్త తెలుసుకున్న అలియా భ‌ట్ వెంట‌నే త‌న రేంజ్ రోవర్ కారులో ముంబైలోని హెచ్ ఎన్‌రియ‌ల‌న్స్ ఫౌండేష‌న్ హాస్పిటల్‌కి చేరుకుంది. ఆసుప‌త్రిలో అలియా కారుకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  రేపు రిషి క‌పూర్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.logo