సోమవారం 25 మే 2020
Cinema - Mar 18, 2020 , 13:34:25

ఆర్ఆర్ఆర్ నుండి అలియా భ‌ట్ ఔట్‌..!

ఆర్ఆర్ఆర్ నుండి అలియా భ‌ట్ ఔట్‌..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ .. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న చ‌ర‌ణ్‌కి జంట‌గా ఆమెని ఎంపిక చేశారు. పూణే షెడ్యూల్‌లో అలియా టీంతో జాయిన్ కానుంద‌ని మేక‌ర్స్ చెప్పుకొచ్చారు. కాని క‌రోనా కార‌ణంగా పూణే షెడ్యూల్ వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. దీంతో అలియా ఇప్ప‌టి వ‌ర‌కు టీంతో జాయిన్ కాలేదు.

బాలీవుడ్ బిజీ న‌టీమ‌ణుల‌లో అలియా భ‌ట్ ఒక‌రు. ఆమె చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్ర‌తి ప్రాజెక్ట్‌కి ప‌క్కా ప్లానింగ్‌తో  డేట్స్ ఇచ్చిన అలియా భ‌ట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టతరంగా మారింద‌ట‌. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ  పూణే షెడ్యూల్ వ‌చ్చే నెల నుండి జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ  స‌మ‌యంలో అలియా భ‌ట్ అందుబాటులో ఉంటుందా అనేది ప్ర‌శ్న‌గా మారింది. అలియాకి కుద‌ర‌ని ప‌క్షంలో ఆమె స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి. ఇప్ప‌టికే కొన్ని కార‌ణాల వ‌ల‌న డైసీ ఎడ్గ‌ర్ జోన్స్ స్థానంలో ఒలీవియా మారిస్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన విష‌యం విదిత‌మే. 


logo