బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 21, 2020 , 23:34:21

రణభీర్‌తో బ్రేకప్‌ కాలేదు!

రణభీర్‌తో బ్రేకప్‌ కాలేదు!

బాలీవుడ్‌ జంట అలియాభట్‌, రణభీర్‌  కపూర్‌ ప్రేమాయణానికి పుల్‌స్టాప్‌ పడిందంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మనస్పర్థల కారణంగా ఈ ప్రేమికులు విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అలియాభట్‌ పుట్టినరోజు వేడుకల్లో రణభీర్‌కపూర్‌ కనిపించకపోవడంతో పాటు ఆమెకు శుభాకాంక్షలు తెలుపకపోవడంతో బ్రేకప్‌ చెప్పుకున్నది నిజమేనంటూ అంతా అనుకున్నారు. ఈ పుకార్లకు అలియాభట్‌ చెక్‌ పెట్టింది. కరోనా కారణంగా షూటింగ్‌ల నుంచి విరామం దొరకడంతో ఇంటికే పరిమితమైన ఆమె సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసింది. ఈ ఫొటోను అద్భుతంగా తీసిన క్రెడిట్‌ నా ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ ఫొటోగ్రాఫర్‌ రణభీర్‌కపూర్‌కు దక్కుతుందని వ్యాఖ్యానించింది.  అలాగే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రణభీర్‌కపూర్‌ తండ్రి రిషికపూర్‌ అనారోగ్యంతో ఉండటంతో అతను కుటుంబానికే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాడని తెలిపింది. తరుచుగా కలవకపోతే విడిపోయినట్లుగా భావించడం సరికాదని తెలిపింది. ప్రస్తుతం  ఈ జంట‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. logo