గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 08, 2020 , 08:02:06

ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ సినిమాలో అలియా భ‌ట్‌..!

ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ సినిమాలో అలియా భ‌ట్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంతో  బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో కొమురం భీంగా అల‌రించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు జూనియ‌ర్. అయిన‌ను పోయిరావాలే హ‌స్తిన‌కి అనే టైటిల్‌తో ఈ మూవీ ప్ర‌చారం జ‌రుపుకుంటుండ‌గా,  ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నుండ‌గా, అలియా భ‌ట్‌ని ఓ క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. పూజా హెగ్డే మ‌రో హీరోయిన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీనిపై అతి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, అలియా భ‌ట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో చెర్రీ స‌ర‌స‌న సీత పాత్ర‌లో న‌టిస్తుంది.  


logo