ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 15:01:50

ఆస్కార్స్‌: అకాడ‌మీ జాబితాలో బాలీవుడ్ స్టార్స్..

ఆస్కార్స్‌: అకాడ‌మీ జాబితాలో బాలీవుడ్ స్టార్స్..

ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక ఆస్కార్ వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన ఈ వేడుకను ఏప్రిల్‌ 25న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రూబిన్‌ పేర్కొన్నారు. ఆస్కార్‌ చరిత్రలో పురస్కారాల వేడుక వాయిదా పడటం ఇది నాలుగోసారి.  1938లో వరదలతో, 1968లో మార్టిన్‌ లూథర్‌కింగ్‌ హత్య కారణంగా, 1981లో రోనాల్డ్‌ రీగన్‌ హత్యాయత్నం వల్ల వాయిదా ప‌డ్డ‌ ఆస్కార్‌ పురస్కారాల వేడు ఈ సారి కరోనా వ‌ల‌న ముందుకు జ‌రిగింది.

ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), ప్ర‌తి ఏడాది అనేక మంది ప్రపంచ సినీ ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానిస్తుంది. 2020 సంవ‌త్స‌రానికి గాను  అకాడమీ జాబితాలో చేర‌బోయే స‌భ్యుల వివ‌రాల‌ని  AMPAS ప్రచురించింది. హృతిక్ రోష‌న్‌, అలియా భ‌ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప్రియ స్వామినాథ‌న్‌, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూస‌ర్స్ విషాల్ ఆనంద్ (వార్‌, భార‌త్‌) మ‌రియు సందీప్ క‌మ‌ల్‌( పానిప‌ట్ ,జ‌ల్‌) త‌దితరులు ఈ ఏడాది అకాడ‌మీ స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొన్నారు. మొత్తం 819 మంది స‌భ్యుల‌ని జాబితాలో చేర్చ‌గా, వివిధ క్యాట‌గిరీలు ఆధారంగా ఎంపిక చేశారు.

గ‌తంలో  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ సినీ ప్రముఖులు ఏఆర్ రెహమాన్, ఇర్ఫాన్ ఖాన్, రేసుల్ పూకుట్టి, ఫ్రీడా పింటో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే త‌దితరులు అకాడమీ స‌భ్యులుగా ఉన్నారు.


logo