మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 15:04:18

షూటింగ్‌లో అల‌సిన ఆలియా భ‌ట్‌.. హాస్పిట‌ల్‌లో చేరిక‌

షూటింగ్‌లో అల‌సిన ఆలియా భ‌ట్‌.. హాస్పిట‌ల్‌లో చేరిక‌

ముంబై:  బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ప్ర‌స్తుతం గంగూభాయ్ కోతేవాలి సినిమాలో న‌టిస్తున్న‌ది.  ఆ సినిమాను సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైర‌క్ట్ చేస్తున్నారు.  రెండేళ్ల క్రితం ప్రారంభ‌మైన సినిమా షూటింగ్ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే జ‌న‌వ‌రి 17వ తేదీ నుంచి ఆ ఫిల్మ్ షూట్ మ‌ళ్లీ స్టార్ట్ అయ్యింది.  అయితే ఆ రోజున ఆలియా చాలా అల‌సిపోయిన‌ట్లు తెలిసింది.  పూర్తిగా స్పృహ కోల్పోయిన ఆలియాను హాస్పిట‌ల్‌లో చేర్పించిన‌ట్లు మ‌రోన‌టి సీమా పావా తెలిపారు. హైప‌ర్ అసిడిటీ, న‌ల‌త‌తో ఆలియా బాధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.  అయితే అదే రోజున ఆమె కోలుకోవ‌డంతో హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.  సంజ‌య్ లీలా భ‌న్సాలీ నటుల‌ను వ‌త్తిడికి గురిచేసే వ్య‌క్తి కాదు అని, ఆయ‌న రోజుకు ఒక సీన్ మాత్ర‌మే షూట్ చేస్తార‌ని సీమా తెలిపారు. కానీ ఆలియా అల‌సిపోవ‌డానికి షూటింగ్ కార‌ణం కాదు అని, మ‌రో కార‌ణ‌మం అయి ఉంటుంద‌ని సీమా డౌట్ వ్య‌క్తం చేశారు.  హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై  న‌వ‌ల ఆధారంగా గంగూభాయ్ కోతేవాలి సినిమాను తీస్తున్నారు. ఓ వ్య‌భిచార నాయ‌కురాలి పాత్ర‌లో ఆలియా న‌టిస్తున్న‌ది.  

VIDEOS

తాజావార్తలు


logo