మహేష్ భట్ ముద్దుల కూతురు అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలపై అభిమానులలో పిచ్చి క్రేజ్ ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇందులో వేశ్యగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు అలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల నిర్మాతగా మారిన ఈ ముద్దుగుమ్మ ‘డ్రీమ్స్’ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇంట గెలిచిన అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు హాలీవుడ్ తెరపై సందడి చేయగా, త్వరలో అలియా భట్ కూడా ఆ ప్రయత్నం చేయనుంది. ఇప్పటికే అలియాభట్ డబ్ల్యూఎంఈ అనే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే ఆమె హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.