హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఆలియా భట్ ఆ మూవీలో సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో జరిగే షూటింగ్ పార్ట్ కోసం ఆమె మళ్లీ నగరానికి వచ్చింది. ఇవాళ ఉదయం ఆమె తన ఇన్‌స్టా డైరీస్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది. ఆర్ఆర్ఆర్ డ్రెస్సింగ్ రూమ్‌లో షూట్ కోసం తయారవుతున్న సమయంలో దిగిన ఫోటోను ఆలియా అప్డేట్ చేసింది. రైజ్ అండ్ షైన్ అన్న ట్యాగ్ కూడా ఇచ్చిందామె. ఆర్ఆర్ఆర్లో హేమాహేమీలు నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్ దీంట్లో నటిస్తున్నారు. తన పుట్టిన రోజున ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత కథల నేపథ్యంతో ఫిక్షన్ మూవీ రూపంలో ఈ సినిమాను తీస్తున్నారు.