శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 12:51:27

పవ‌న్ క‌ళ్యాణ్ హీరోగా, అలీ నిర్మాత‌గా క్రేజీ చిత్రం..!

పవ‌న్ క‌ళ్యాణ్ హీరోగా, అలీ నిర్మాత‌గా క్రేజీ చిత్రం..!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టాప్ క‌మెడీయ‌న్ అలీ మ‌ధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా వారి మ‌ధ్య ఉన్న మైత్రి బంధాన్ని చూసి మురిసిపోతుంటాయి. అయితే గ‌త ఎల‌క్ష‌న్స్ స‌మయంలో ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోగా, అప్ప‌టి నుండి కాస్త దూరంగా ఉంటూ వ‌చ్చారు. రీసెంట్‌గా ఓ ఫంక్ష‌న్ లో ఇద్ద‌రు క‌ల‌వ‌డం, ఫొటోలు దిగ‌డం అవి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డం జ‌రిగింది.

ఎన్నో ద‌శాబ్ధాలుగా క‌మెడీయ‌న్‌గా అల‌రిస్తున్న అలీ నిర్మాత‌గాను మారిన సంగ‌తి తెలిసిందే. అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అనే బ్యాన‌ర్‌ను స్థాపించి ప‌లు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఓ  సినిమాని అలీ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. గోపాల గోపాల ఫేం కిషోర్ కుమార్ పార్ధ‌సాని( డాలి) ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడ‌ని టాక్. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రానున్న‌ట్టు తెలుస్తుంది. 

VIDEOS

logo