టాలీవుడ్ (Tollywood) యాక్టర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు (101 Jillala Andagadu). శ్రీనివాస్ అవసరాల స్క్రిప్ట్ నందించగా..రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి అలసిన సంచారి వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫిలాసఫికల్ టచ్‌తో మెలోడీగా సాగుతున్న ఈ పాటలో దాదాపు సినిమాలోని క్యారెక్టర్లన్నింటినీ చూపించాడు డైరెక్టర్.
ఈ సినిమాలో అవసరాల బట్టతలతో బాధపడే గొట్టి సూర్యనారాయణ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. కాగా అవసరాల తన సమస్యతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడనేది పాటలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. శ్రీ విశ్వ రాసిన ఈ పాటను హేమచంద్ర పాడాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో దిల్ రాజ్, క్రిష్ సమర్ఫణలో శిరీష్, వై రాజీవ్ రెడ్డి, జే సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ రామ్, ఎడిటింగ్ కిరణ్ గంటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!