మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 22, 2020 , 11:52:56

సన్ నెక్ట్స్‌లో 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రం

సన్ నెక్ట్స్‌లో 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రం

సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 150 కోట్ల‌కి పైగా షేర్ క‌లెక్ట్ చేసిన ఈ చిత్రం నాన్ బాహుబ‌లి మూవీగా ప‌లు రికార్డులు సొంతం చేసుకుంది. సంగీతం, క‌థ‌, సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి ప్రాణంగా నిలిచాయి. డిజిట‌ల్ ప్లాట్‌ఫాంస్‌లో ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని నెటిజ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. సన్ నెక్ట్స్ భారీ రేట్ ఇచ్చి మరీ అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోగా, ఫిబ్ర‌వ‌రి 26 నుండి అందుబాటులోకి రానుంది. మ‌రి డిజిట‌ల్ ప్లాట్‌ఫాంస్‌లో ఈ చిత్రం హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. న‌వ‌దీప్, సుశాంత్‌, ట‌బు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించిన విష‌యం తెలిసిందే. 

 


logo