ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 19:05:30

డంబెల్స్ పట్టుకుని ఈత కొట్టిన అక్షయ్..వీడియో

డంబెల్స్ పట్టుకుని ఈత కొట్టిన అక్షయ్..వీడియో

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఫిట్ నెస్ మంత్ర గురించి అందరికీ తెలిసిందే. వయస్సుతో సంబంధం లేకుండా చాలా కఠినతరమైన టైం టేబుల్ ను ఫాలో అవుతుంటాడు అక్షయ్. తాజాగా అక్షయ్ కుమార్ స్విమ్మింగ్ చేస్తున్న త్రోబ్యాక్ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అక్షయ్ అందరికంటే భిన్నంగా చేతిలో డంబెల్స్ పట్టుకుని మరీ ఈత కొట్టడం విశేషం. 

మండిపోతున్న వేసవికాలంలో స్మిమ్మింగ్ చేయడం కాదు...ఇక్కడ నేను బరువులు పట్టుకుని మరీ ఈత కొడుతున్నాను. మీరూ ఇలాంటి ప్రయత్నం చేసేందుకు ఈత కొట్టడం మంచిదని నిర్దారించుకోండి. ఇది కాళ్లకు మంచి వ్యాయామంలా పనిచేస్తుందని క్యాప్షన్ ఇచ్చాడు.  మొదట 2018లో అక్షయ్ కుమార్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo