ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 18:24:25

ఆలోచింపజేస్తోన్న అక్షయ్ యాడ్..వీడియో

ఆలోచింపజేస్తోన్న అక్షయ్ యాడ్..వీడియో

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోస్ట్ లాక్ డౌన్ రెస్పాబులిటీస్ పేరుతో తెరకెక్కించిన యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అరే బబ్లూ లాక్ డౌన్ ఎత్తివేయకముందే బయటకు వెళ్తున్నావేంటీ..కరోనా నీ ముందే ఉందీ..కరోనా అంటే భయం లేదా అంటూ ఓ పెద్దాయన అక్షయ్ ను అడుగుతాడు. దీనికి తాను తిరిగి పనికెళ్తున్నాని అక్షయ్ బదులిస్తాడు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేసే ప్రదేశాల్లో ముఖానికి మాస్కు పెట్టుకుని, ప్రతీ వ్యక్తికి కనీసం రెండు గజాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ప్రతీసారి చేతులను శానిటైజర్ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతర ప్రాణాలను రక్షించినవారమవుతామని యాడ్ లో అక్షయ్ చెప్తున్న సంభాషణలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. logo