ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 28, 2020 , 20:34:21

అక్ష‌య్ ను మెచ్చుకున్న ట్వింకిల్ ఖ‌న్నా..

అక్ష‌య్ ను మెచ్చుకున్న ట్వింకిల్ ఖ‌న్నా..

ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఎల్ల‌ప్పుడు అండ‌గా నిలిచే అక్ష‌య్ కుమార్‌..తాజాగా క‌రోనా నేప‌థ్యంలో  విపత్క‌ర పరిస్థితులు ఏర్ప‌డ‌టంతో త‌న వంతు సాయంగా రూ. 25 కోట్ల రూపాయ‌ల‌ని విరాళంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌న భ‌ర్త దేశ ప్ర‌జ‌ల కోసం రూ.25 కోట్లు విరాళ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి..తాము ఎంతో గ‌ర్వ‌ప‌డేలా చేశార‌ని అక్ష‌య్ స‌తీమ‌ణి ట్వింకిల్ ఖ‌న్నా పేర్కొన్నారు. డ‌బ్బులు కాపాడుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది..ఇంత‌పెద్ద మొత్తంలో ఎలా అని అక్ష‌య్‌ను అడిగాను.నేను కెరీర్ ను ప్రారంభించిన‌పుడు నా ద‌గ్గ‌ర ఏమీ లేదు. ఇపుడు ఇలాంటి పొజిష‌న్ లో ఉన్నా. ఏమి లేని వారి కోసం ఏదైనా సాయం చేయ‌కుండా ఎలా ఉండ‌గ‌లను అని చెప్పాడ‌ని ట్వింకిల్ ట్వీట్ చేశారు. 
logo