గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 11:22:18

అల్లుడిగా గ‌ర్విస్తున్నానంటున్న అక్ష‌య్ కుమార్

అల్లుడిగా గ‌ర్విస్తున్నానంటున్న అక్ష‌య్ కుమార్

అక్ష‌య్ కుమార్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఆనంద క్ష‌ణాల‌ని ఎప్పుడు త‌న సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ ఉండే ఖిలాడీ కుమార్ తాజాగా త‌ను అల్లుడిగా గ‌ర్విస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు కార‌ణం క్రిస్టోఫ‌ర్ నోల‌న్ నుండి డింపుల్ క‌పాడియాకు థ్యాంక్యూ నోట్ రావ‌డం.

శుక్ర‌వారం రోజు థియేట‌ర్స్ తిరిగి తెర‌చుకోవ‌డంతో చాలా చోట్ల క్రిస్టోఫర్ నోలన్  రూపొందించిన మనస్సును వంచించే నాటకం టెనెట్ ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన డింపుల్‌కు లెట‌ర్ రాసారు నోల‌న్. ఈ లెట‌ర్‌ని అక్ష‌య్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. నేను ఆమె స్థానంలో ఉంటే ఆశ్చ‌ర్యంతో అలా ఉండిపోయేవాడిని. టెనెట్‌లో ఆమె టాలెంట్ మ్యాజిక్ న‌న్ను ఆశ్చ‌ర్య‌పరిచింది.నేను చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను అంటూ అక్ష‌య్ పేర్కొన్నారు. కాగా, డింపుల్ క‌పాడియా కూతురు ట్వింకిల్ ఖ‌న్నాని అక్ష‌య్ కుమార్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే


logo