మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 29, 2020 , 20:33:05

లక్ష్మీబాంబ్‌ పోస్టర్‌ను విడుదల చేసిన అక్షయ్‌కుమార్‌

లక్ష్మీబాంబ్‌ పోస్టర్‌ను విడుదల చేసిన అక్షయ్‌కుమార్‌

ముంబై: ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్‌హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తన హార్రర్‌ కామెడీ చిత్రం ‘లక్ష్మీబాంబ్‌’కు సంబంధించిన పోస్టర్‌ను ఆ సినిమా హీరో అక్షయ్‌కుమార్‌ సోమవారం విడుదల చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను పెట్టాడు. ఇందులో అక్షయ్‌కుమార్‌ పెద్ద బొట్టుపెట్టుకొని, నీలం రంగు మొఖం, ఎరుపెక్కిన కళ్లతో చేతులకు గాజులు ధరించి, స్త్రీ  వేషధారణలో భయానకంగా ఉన్నాడు. ‘ఎప్పుడైతే నా ముందు నిజంగా దెయ్యం ప్రత్యక్షమవుతుందో.. అప్పడు నేను గాజులు ధరిస్తానని ప్రమాణం చేస్తున్నా’ అనే క్యాప్షన్‌ను పోస్టర్‌కు జోడించాడు. 

ఈ హార్రర్‌కామెడీ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది అని ప్రేక్షకులనుద్దేశించి అక్షయ్‌ పేర్కొన్నాడు. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను ఇంట్లోనే కంఫర్ట్‌గా చూడండని కోరాడు. అలాగే, అంతకుముందు ఆయన మరో పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశాడు. ఇందులో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ త్రిశూలం చేతపట్టుకొని నటరాజు ఫోజులో ఉంది. కాగా, ఇందులో నటి కైరా అద్వానీ కీలక ప్రాత పోషిస్తున్నది. 

logo