తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఢిల్లీ సుందరి రాశీఖన్నా. తాజాగా ఆమె తమిళంలో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. ‘సర్దార్’ సినిమా కోసం తొలిసారి హీరో కార్తితో జోడీకట్టబోతున్నది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కార్తి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో పొడవాటి క్రాఫ్, గడ్డంతో సాల్ట్ పెప్పర్ లుక్‌లో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కార్తి కనిపిస్తున్నారు. దేశ సరిహద్దులతో ముడిపడి సాగే కథ ఇదని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రాశీఖన్నా. న్యూ బిగినింగ్ ఇదని పేర్కొన్నది. కార్తితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా చాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం.