గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 30, 2020 , 11:12:47

బియ‌ర్ గ్రిల్స్‌తో సాహసం చేసేందుకు సిద్ధ‌మైన అక్ష‌య్..!

బియ‌ర్ గ్రిల్స్‌తో సాహసం చేసేందుకు సిద్ధ‌మైన అక్ష‌య్..!

డిస్క‌వరీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బియ‌ర్ గ్రిల్స్ పాపుల‌ర్ స్టార్స్‌తో చేయించే అద్భుత విన్యాసాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఆ మ‌ధ్య మోదీతో షో చేసిన బియ‌ర్ రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్‌తో చేశారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే అనువైన స్థలాన్ని బియ‌ర్ వెతికాడ‌ని అక్క‌డ అక్ష‌య్‌తో క‌లిసి తాను ప్ర‌యాణించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ షో ద్వారా అక్ష‌య్ .. బియ‌ర్ నుండి కొన్ని టెక్నిక్స్ కూడా నేర్చుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షోలో పాల్గొనేందుకు అక్ష‌య్ ఇప్ప‌టికే మైసూర్ చేరుకున్నట్టు టాక్. త్వ‌ర‌లో షూటింగ్‌కి సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టిస్తార‌ని బాలీవుడ్ మీడియా చెబుతుంది. కాగా, అక్ష‌య్ కుమార్ ప్ర‌స్తుతం అర‌డ‌జ‌నుకి పైగా సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. 


logo